Tag Archives: Current Affairs

3 ముక్కలవుతున్న హైదరాబాద్

23 Hyderabad

మనం చరిత్రలో విభజించు పాలించు అనే ఓ కాన్సెప్ట్ వినే ఉంటాం. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ అదే సిద్దాంతాన్ని పాటిస్తున్నారు. తెలంగాణ.. తెలంగాణ అంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టి బౌగోళికంగానే కాదు మానసికంగా కూడా ఆంధ్రా-తెలంగాణను విడదీశాడు. అలా విడిపోతేనే ఆయన ఆటలు సాగుతాయని కాబోలు అదే సిద్దాంతాన్ని ఇప్పుడు హైదరాబాద్ నగరం మీద కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని మూడు ముక్కలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ గా ఉన్న మన హైదరాబాద్ నగరాన్ని మూడు కార్పోరేషన్లుగా విడదీయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.
ఇప్పటికే ఈ విభజన దిశగా నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ను రెండుగా చేయాలని తెరాస నేతలు కొందరు భావిస్తుండగా మరికొందరు మాత్రం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లుగా మూడు కార్పోరేషన్లు చేయాలని ప్రతిపాదన వస్తోంది. కాగా దీనివెనుక కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని ఇప్పటికే ఆరోపణలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే తనతో మిత్రపక్షంగా చేరిన మజ్లిస్ పార్టీకి ఓ కార్పోరేషన్ ను అప్పగించి మిగతా రెండింటిలో తన హవా చాటుకోవాలని తెరాస ప్లాన్ అని కూడా చెప్పుకుంటున్నారు. అంతేకాదు హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర సెటిలర్స్ వలన తనకు కార్పోరేషన్ ఎన్నికలలో దెబ్బ తగలకుండా ముందుగానే ఈ ప్రక్షాళనకు పూనుకుంటున్నట్లుగా కనిపిస్తుందని ఓ టాక్ మొదలైంది!

Sachin Who is he Jwala Gutta controversial comments

14Sachin Who is he  Jwala Gutta controversial comments

సచినా? అతనెవరో నాకు తెలియదు” అంటూ టెన్నిస్ స్టార్ షరపోవా చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. అదింకా సద్దుమణగక ముందే భారత షట్లర్ గుత్తా జ్వాల దీనికి మరింత ఆజ్యం పోసింది. సచిన్ తెలియకపోవడంలో తప్పేముంది అని ప్రశ్నించింది. షరపోవా వ్యాఖ్యలను అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని వెనకేసుకొచ్చింది. సచిన్ ఇండియా కి డాన్ కావొచ్చేమో కానీ.. ప్రపంచానికి అతను ఓ సాదారణ ఆటగాడేగా అంటూ సంచలన కామెంట్స్ చేసింది. 

online sex in hyderabad

13online sex in hyderabad

హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న గ్యాంగులను పట్టుకోవడానికి పోలీసులు విటుల వేషంలో వెళుతున్నారు. వెబ్‌సైట్లలో ఇచ్చిన ఫోన్‌ నెంబర్ల ద్వారా గ్యాంగులను సంప్రదించి వల వేస్తున్నారు. ఇలా బంజారాహిల్స్‌లోని ఒక స్టార్‌ హోటల్‌పై రైడ్‌ చేశారు. హోటల్‌లో మేనేజరియల్‌ స్టాఫ్‌ ఒకర్ని, రూమ్‌ బాయ్‌ను అరెస్ట్‌ చేసి ముగ్గురు అమ్మాయిలను రక్షించారు. ముంబాయి, కోల్‌కతాలకు చెందిన గ్యాంగులు హైదరాబాద్‌లో స్కిన్‌ బిజినెస్‌ చేస్తున్నారని పోలీసులు వివరిస్తున్నారు. వారం, పది రోజుల పాటు అమ్మాయిలతో కాంట్రాక్టు కుదుర్చుకుని ఇక్కడకు తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు.  ఈ గ్యాంగులు తమను సంప్రదించిన వారిని ఒకటి రెండు సార్లు పరీక్షించి గానీ అమ్మాయిని పంపడం లేదు. పోలీసుల దాడులు పెరగడంతో వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైనా హోటల్‌ నుంచి విటుడు ఫోన్‌ చేస్తే.. సదరు హోటల్‌ స్టాఫ్‌కు ఫోన్‌ చేసి.. విటుడు అక్కడ ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేసుకుంటున్నారు. విటుడు హోటల్‌ రూములో దిగినట్లు పక్కాగా తెలిస్తే అమ్మాయిని పంపిస్తున్నారు.